విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణం స్పందించాలి – AISA డిమాండ్
కేజీబీవీ వీరబల్లి ప్రిన్సిపాల్ సాయి దివ్య బదిలీపై వివాదం చెలరేగింది. డీఈవో సుబ్రహ్మణ్యం చర్యలపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.AISA రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల లవకుమార్ మాట్లాడుతూ – "2023లో జరిగిన కేజీబీవీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో సాయి దివ్య పేరు మెరిట్ లిస్ట్‌లో లేదు. వెరిఫికేషన్, 1:3 లిస్టులలో కూడా ఆమె పేరు లేకపోయినా ఉద్యోగం రావడం అధికారుల గొప్పతనమే. అంతేకాకుండా విద్యార్థినిలను కులం పేరుతో దూషించే వ్యక్తికి విచారణ లేకుండా మరోచోట పోస్టింగ్ ఇవ్వడం అనేది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమే" అని మండిపడ్డారు.