కర్నూలు: కర్నూలులో 20 కేజీల గంజాయి స్వాధీనం – నలుగురు అరెస్ట్ : సిఐ విక్రం సింహం
కర్నూలులో 20 కేజీల గంజాయి స్వాధీనం – నలుగురు అరెస్ట్ కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నాలుగో పట్టణ సీఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఏపీ 0N3258 నంబర్ కారులో 20 కేజీల గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని గంజాయి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.అక్రమ రవాణాపై క