తాడిపత్రి: చాగల్లు రిజర్వాయర్ వద్ద నీటిని విడుదల చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన MLA
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చాగల్లు రిజర్వాయర్ నుంచి పెన్నానదికి నీటిని విడుదల చేశారు. గేట్ల వద్ద గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. అనంతరం గేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దేవుడు దయతో గత ఏడాది.. ఈ ఏడాది రిజర్వాయర్లు నిండాయన్నారు. నీటిని తెచ్చేందుకు ఎంతో కృషి చేశామన్నారు. కాలువలకు నీటిని అందించి రైతన్నలలో కళ్లలలో ఆనందం చూస్తున్నామన్నారు.