ఉరవకొండ: బెలుగుప్ప రవితేజ మండల సమైక్యలో మన లెక్కలు మన డబ్బుపై ఈనారీలకు శిక్షణ కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం స్థానిక రవితేజ మండల సమైక్య వెలుగు కార్యాలయం నందు మన మన లెక్కలు మన డబ్బులు పైన సంఘాల నుండి ఎంపిక చేసిన ఈనారీలకు గురువారం శిక్షణ సమావేశ కార్యక్రమాన్ని వెలుగు ఏపీఎం సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పెద్దన్న, కార్యదర్శి మల్లికార్జున పాల్గొన్నారు. ఈనారి శిక్షణ కార్యక్రమంలో సభ్యులకు మన లెక్కలు మన డబ్బులు అనే యాప్ పైన సంఘాల నిర్వహణ, పొదుపు, అప్పులు, బ్యాంకు రుణాల లెక్కలు, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా చెల్లింపులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల సమైక్య లీడర్లు భాగ్యమ్మ గీతమ్మ పాల్గొన్నారు.