సంజాములలో అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఈనెల 14న సంజామలలో జరిగిన పెద్దమ్మ తల్లి దేవర ఉత్సవాలలో అదృశ్యమైన డక్కా సుబ్బరాయుడు (68) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రమణ వెల్లడించారు. బనగానపల్లె మండలం కొత్తపేటకు చెందిన సుబ్బరాయుడు దేవర ఉత్సవాలకు వచ్చి కనపడకుండా పోయాడని 15న సంజామల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా కానాల ఎస్సీ కాలనీ సమీపంలో కుళ్లిపోయి ఉన్న సుబ్బరాయుడు మృతదేహాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు.