అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
Ongole Urban, Prakasam | Jul 9, 2025
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ఒంగోలు నగరంలోని 30, 32 డివిజన్లో బుధవారం ఉదయం పర్యటించారు. స్థానికంగా ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఇంటింటికి తిరిగి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో పలువురికి రేషన్ కార్డులు మరియు పెన్షన్లు నిలిపివేశారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. వెంటనే వాటిని వెరిఫై చేసి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.