ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం, హాజరైన మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Apr 24, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామితో పాటు, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, కలెక్టర్ రాజబాబు హాజరయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి స్వామి కొనియాడారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులను సంబంధిత అధికారులను అభినందిస్తూ సన్మానించారు