పలమనేరు: పలమనేరు:మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే,వైసిపి అధికారం చేపట్టిన వెంటనే తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం -మాజీ ఎమ్మెల్యే
పలమనేరు: మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణచేస్తే సహించబోయేది లేదని దీనివలన పేద విద్యార్థి వైద్య విద్యను అభ్యసించడం రాబోయే రోజుల్లో కష్టతరమవుతుంది ఒక్క పేద వాడు డాక్టర్ కాలేడన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనుక్కు తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు అంటూ విమర్శించారు. ఒకవేళ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగితే రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు మళ్లీ ప్రభుత్వ పరం చేస్తామన్నారు.