నంద్యాల అర్బన్: మహానంది క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు
Nandyal Urban, Nandyal | Apr 5, 2026
నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో వేసవి కాలం ఎండలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చలువ పందిర్లతో పాటు భక్తుల కాళ్లు కాలకుండా కొబ్బరి పీచుతో తయారు చేసిన మ్యాట్లు ఏర్పాటు చేసినట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. వేసవికాలం ముగిసే వరకు ఇలాగే ఉంచుతామని ఆలయ అధికారులు తెలిపారు