మాసబ్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఎంపీ ఆర్.కృష్ణయ్య హాజరై విద్యార్థులకు మద్దతు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.