ఉరవకొండ: గ్రామ పంచాయతీ లలో రీ సర్వే గ్రామసభలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామపంచాయతీలలో బుధవారం రీ సర్వే గ్రామసభలను మండల తహసీల్దార్ అనిల్ కుమార్, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ గురుబ్రహ్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. గంగవరం మరియు కోణంపల్లి గ్రామాల్లో రీ సర్వే గ్రామ సభలను నిర్వహించి ప్రజల నుండి సమస్యలపై వినతులను స్వీకరించారు. భూముల రీ సర్వేకు సంబంధించి వచ్చిన వినతులను ఉన్నతాధికారులకు పంపి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తహసిల్దార్ పేర్కొన్నారు.