ఒంగోలు అర్బన్: మెగా టాక్స్ మేళా' పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజా బాబు
Ongole Urban, Prakasam | May 4, 2026
గ్రామ పంచాయతీల ఆర్థిక పురోభివృద్ధికి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని జిల్లా కలెక్టర్,రాజా బాబు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల మెగా టాక్స్ మేళా గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్ల ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ప్రత్యేక రాయితీలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.మే 31వ తేదీలోపు ఇంటి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రిబ్బేట్ వర్తిస్తుంది అన్నారు