అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి పునాది అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను త్యాగం చేసిన రోజు (డిసెంబర్ 15) ను ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా.... అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.