జహీరాబాద్: మహీంద్రా కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి యత్నం, పోలీసులు రావడంతో సత్తును వదిలి పారిపోయిన దొంగలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆలయంలో దొంగలు చొరబడి తాళాలను పగలగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీలను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్తున్న సమయంలో పెట్రోలింగ్ పోలీసులు ఆలయం వద్దకు చేరుకోవడంతో దొంగలు చోరీ సొత్తును వదిలిపెట్టి పారిపోయారు. ఘటన విషయం తెలుసుకున్న పట్టణ సీఐ శివలింగం, ఎస్సై వినయ్ కుమార్ ఆలయానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.