కర్నూలు: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు: వైకాపా జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు సమీపంలో బస్సు ప్రమాద ఘటనపై కూటమి ప్రభుత్వం ప్రశ్నించిన వ్యక్తులపై పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తాము నిరుపిస్తామని తెలిపారు.