బనగానపల్లె: యాగంటి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న కాటసాని బ్రదర్స్
నంద్యాల జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి దంపతులు, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోమవారం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, శేషవస్త్రంతో కాటసాని బ్రదర్స్ ను సత్కరించి ఆశీర్వదించారు.