కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శుక్రవారం మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, కనిగిరి జూనియర్ సివిల్ జడ్జ్ రూప శ్రీ నేతృత్వంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత ఆరోగ్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్, టెలి మెడిసిన్ సంజీవిని, కిషోర బాలికలకు అందిస్తున్న వైద్య పథకాలపై అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సూచించారు.