ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనధికారకంగా ఏర్పాటు చేస్తున్న వాహనాల నుంచి ఎల్ఈడీ లైట్లు తొలగిస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 7, 2026
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఏర్పాటుచేసిన ఎల్ఈడీ లైట్లు పోలీసులు తొలగించారు. ఈ ఎల్ఈడి లైట్లు వల్ల రాత్రి వేళల్లో రహదారి సరిగా కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎదురుగా వస్తున్న వాహనదారులు చెప్పిన వివరాల మేరకు ఎస్పీ ఆదేశాలతో వాహనాల నుంచి ఎల్ఈడి లైట్లు తొలగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నావు.