ఒంగోలు అర్బన్: యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ కింద రూ.1.20 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెల్లింపు.
Ongole Urban, Prakasam | Apr 16, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ ద్వారా మరో ముఖ్యమైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ వేగంగా పరిష్కరించబడింది. ప్రమాదంలో మరణించిన ఏపీ సచివాలయం ఉద్యోగి పోధిలి భార్గవనాథ్ భార్య పోధిలి భావిత కి రూ.1,20,00,000 (ఒక కోటి ఇరవై లక్షలు) విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ రాజా బాబు చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ యూనియన్ బ్యాంక్ అందిస్తున్న కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్‌లోని ఇన్సూరెన్స్ ను వినియోగించుకోవాలన్నారు