ఒంగోలు అర్బన్: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది: ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | May 4, 2026
కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం మార్కాపురంలో జరిగిన నాయకులు కార్యకర్తల సమావేశంలో బూచేపల్లి పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్ని పూర్తి చేసేందుకు ఎంత నిధులు అవసరమవుతాయో జగనన్న కమిటీలు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని బూచేపల్లి అన్నారు.