డోన్: డోన్ నియోజకవర్గం భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
Dhone, Nandyal | Apr 3, 2026 డోన్ నియోజకవర్గంలోని డోన్, బేతంచెర్ల,ప్యాపిలి పట్టణలతో పాటు , పరిసర గ్రామాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆర్సీఎం చర్చి పాస్టర్ కిరణ్ కుమార్ నేతృత్వంలో క్రైస్తవ సోదరులు కర్నూలు రహదారి నుంచి చర్చి వరకు సిలువ యాత్ర చేపట్టారు. సిలువను మోస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుప్రభువు ఆశీస్సులతో లోకమంతా శుభం కలగాలని వారు ఆకాంక్షించారు.