ఆళ్లగడ్డ: రామతీర్థం పుట్టాలమ్మ పుణ్య క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
ఆళ్లగడ్డ మండల పరిధిలోని రామతీర్థం పుట్టాలమ్మ పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తులతో కిటికీటలాడింది, స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పుట్టాలమ్మకు పాలు పోసి మొక్కులు తీర్చుకునేందుకు ప్రతి ఆదివారం భక్తులు ప్రత్యేకంగా తరలి వస్తున్నారు, ఈ పుట్ట మహిమతో సంతాన ప్రదాతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పై భక్తుల విశ్వాసం ప్రగాఢంగా విరజిల్లు తోంది, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు