బెల్లంపల్లి: పెర్కపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి శంకర్ అనే వ్యక్తి మృతి
బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతం తో ఒక వ్యక్తి మృతి చెందాడు గ్రామస్థుల కథనం ప్రకారం కర్రెశంకర్ ఇంట్లో ఓ షెడ్డు లో ఉన్న ఇంటి సామా గ్రినీ మరో గది లోకి తరలిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్ తెగి చేతికి తగలడం తో విద్యుత్ ఘాతానికి గురై శంకర్ మృతి చెందారు ఘటనా స్థలాన్ని తాళ్ళ గురిజాల పోలీసులు సందర్శించారు.మృత దేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నట్లు ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు