రాజేంద్రనగర్: మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు
ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు, ఆటో, యాక్టివా టూ వీలర్, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2011 నుంచి 720 ఫోన్ దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరు దొంగిలించిన మొబైల్స్‌ను అబిడ్స్ జగదీశ్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ACP శ్రీనివాస్ కుమార్ తెలిపారు