కందుకూరు: పొగాకు అధిక సాగు చేస్తే నష్టం
కందుకూరు 27వ వేలం కేంద్రంలో రైతులకు అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది. వేలం అధికారి బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ఉత్పత్తి అధికంగా ఉండటంతో ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయని తెలిపారు. భూములు కౌలుకు తీసుకొని అధికంగా పొగాకు సాగు చేయవద్దని హెచ్చరించారు. కర్ణాటక మార్కెట్లో హైగ్రేడ్ ధర రూ.290, లో గ్రేడ్ ధర రూ.230–250 మాత్రమే ఉందని ఎన్టీఓ రాజగోపాల్ చెప్పారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.