ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు కలెక్టర్ రాజబాబు వెల్లడి
Ongole Urban, Prakasam | Apr 7, 2026
ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు మంగళవారం కలెక్టర్ రాజబాబు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు వడదెబ్బ తగలకుండా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వడదెబ్బ తగిలితే అందుకు అవసరమైన మెడికేషన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వాతావరణ శాఖ అధికారులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.