అనంతపురం అర్బన్: నార్పల సమీపాన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 5, 2026
అనంతపురం జిల్లా నార్పల సమీపన మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని తాడిపత్రి మండలం హుస్సేనాపురం గ్రామానికి చెందిన సాంబశివుడు అనే వ్యక్తికి కాలు విరగడంతో తలకు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. తాడిపత్రి నుండి హుస్సేనాపురంకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా నార్పల ఊరి బయట ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.