అనంతపురం జిల్లా ఉరవకొండ లోని శివరామిరెడ్డి కాలనీలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదిలక్ష్మి (40) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త హరికృష్ణతో పాటు అత్తమామల వేధింపుల కారణంగానే ఆదిలక్ష్మి ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆదిలక్ష్మి బంధువులు అత్తమామలపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.