కోడుమూరు: ప్యాలకుర్తి_ కోడుమూరు మధ్యన ఎద్దుల బండిని ఢీకొన్న బైక్, వ్యక్తికి తీవ్ర గాయాలు
కోడుమూరు మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్యాలకుర్తి కోడుమూరు మధ్యలో చీకటి పడ్డాక ఎద్దుల బండిని, బైక్ ఢీకొంది. కూలి పనుల నిమిత్తం వెళ్లిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై భార్యాభర్త వస్తున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.