జహీరాబాద్: జహీరాబాద్ మేస్త్రి కాలనీలో యువకుడు అదృశ్యం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు అదృశ్యమైనట్లు పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. పట్టణంలోని మేస్త్రి కాలనీకి చెందిన దిలీప్ అనే యువకుడు ఓ బట్టల దుకాణంలో పని చేస్తూ జీవనం గడిపే వాడన్నారు. ఈనెల మూడవ తేదీన ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని, బంధువుల వద్ద తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ లభ్యం కాలేదని అతని భార్య ఎస్తేరు రాణి గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరికైనా యువకుడి ఆచూకీ తెలిస్తే జహీరాబాద్ పట్టణం పోలీసులకు సమాచారం అందించాలన్నారు.