మధిర: పట్టణంలో ముగిసిన ఫైర్ వారోత్సవాలు
మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీ నందుగల ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని రద్దీ కూడళ్లలో ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ బండారు రాంబాబు మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాల సమయంలోనే కాకుండా పకృతి విపత్తుల సమయంలో రోడ్డు ప్రమాదాలు, జల ప్రమాదాల సమయంలో కూడా ఫైర్ సేవలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు.