ఒంగోలు అర్బన్: ఒంగోలు ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం, పోలీసు వారి వేధింపులే కారణమని వీడియోలో వెల్లడి
Ongole Urban, Prakasam | Apr 18, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఇందిరమ్మ కాలనీకి చెందిన కొత్త హరీశ్ కూల్ డ్రింక్లో ఎలుకల పేస్ట్ కలుపుకొని ఆత్మహత్యాయత్నంకు పాల్పడుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. దీనికి కారణం తాలూకా సీఐ, ఐడీ పార్టీ పోలీసులు అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. హరీశ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.