నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి వేగం - ఉపాధి అవకాశాల విస్తరణకు కలెక్టర్ పిలుపు
Nandyal Urban, Nandyal | Apr 10, 2026
నంద్యాల జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రాజెక్టుల ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్మించిన సమావేశాలు రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పరిపాలన స్థానిక సమస్యలపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్,డిఆర్ఓ రాము నాయక్, ఆర్డీవోలు ప్రాజెక్టు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.