కొత్తగూడెం: కొత్తగూడెం లక్ష్మీదేపల్లి మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కూనంనేని
ప్రభుత్వ సహకారం తో కొత్తగూడెం నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కొత్తగూడెం ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ,లక్ష్మీదేవి పల్లి మండలాల్లో కోట్లాది రూపాయల వివిధ అభివృద్ధి పనులకు ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సోమవారం చేసారు.కొత్తగూడెం ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన , కనీస సౌకర్యాలు అయిన రోడ్లు,డ్రైనేజీల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.ప్రత్యేక ప్రణాళిక ద్వారా నియోజకవర్గం సమగ్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు వివరించారు.