కామారెడ్డి: లంబాడీల ఆత్మగౌరవ సభ గోడ ప్రతుల ఆవిష్కరణ : ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయక్
కామారెడ్డి : సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద 'హలో లంబాడి-చలో హైదరాబాద్' నినాదంతో లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి లంబాడి విద్యార్థుల వసతి గృహంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు లంబాడి స్టూడెంట్ ఆర్గనేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ సభకు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్ నాయక్, అర్జున్, సర్దార్, శంకర్, నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు.