బనగానపల్లె: బనగానపల్లెలో షాది ఖానా నిర్మాణ పనులను సమీక్షించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలో షాదీఖానా భవన నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సౌకర్యార్థం అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న ఈ షాదీఖానా భవనం సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా ఉంటుందన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.