ఓబులవారిపల్లి మండలంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి.. బాణాసంచా పేలి బాలుడికి తీవ్ర గాయాలు
వినాయక నిమజ్జనం సందర్భంగా ఓబులవారిపల్లి మండలం కొత్త మంగంపేటలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. వేపన రంజిత్ అనే 12 ఏళ్ల బాలుడి చేతిలో టపాసు పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చేయి పూర్తిగా ఛిద్రం అవ్వడంతో అతని చేతిని మనికట్టు వరకు తొలగించారని బంధువులు తెలిపారు. అతని తండ్రి ఇటీవల ప్రమాదంలో గాయపడడంతో అతని రెండు కాళ్లు తొలగించారని వారు తెలిపారు. తండ్రి, కొడుకుకు ఇలా జరగడంతో, ఆ కుటుంబంలో పూర్తి విషాదం నెలకొంది.