నంద్యాల అర్బన్: నంద్యాల - మహానంది రహదారి అంతా వాహనాలు
Nandyal Urban, Nandyal | Jun 3, 2026
మహానంది మండలం తమ్మడపల్లెలో పెద్దమ్మ దేవర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు, బంధుమిత్రులతో గ్రామం కిటకిటలాడింది. మధ్యాహ్నం విందు అనంతరం తిరుగు ప్రయాణంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. నంద్యాల నుంచి మహానంది వెళ్లే దారి అంతా వాహనాలతో నిండిపోయింది. మహానంది SI రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ ఇబ్బందులు లేకుండా నియంత్రణకు తీవ్రంగా కృషి చేశారు.