బోయిన్‌పల్లి: కోరెం గ్రామంలో గేదెను ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇరువురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,కోరెం గ్రామ శివారులో ద్విచక్రవాహణం గేదెను ఢీకొన్న ఘటన బుధవారం 9:20 PM కి చోటుచేసుకుంది,జగిత్యాల కి చెందిన హరీష్ తన స్నేహితుడు కలిసి ద్విచక్ర వాహనం పై బోయిన్పల్లి కి వెళుతుండగా కోరెం గ్రామ శివారులో వేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి గేదెను బలంగా ఢీ కొట్టారు,దీంతో పడిపోయిన హరీష్ కి తీవ్ర గాయాలు అయ్యాయి,అపస్మారక స్థితిలోకి వెళ్లిన హరీష్ ను అతని స్నేహితుడు గ్రామస్తుల సహాయంతో 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు, గేదెక కూడా కాలు విరిగి తీవ్ర గాయాలై కదలిలేని స్థితిలో ఉందిని గేదె యజమాని శ్రీహరి తెలిపారు,