నందికోట్కూరు: ఆర్థిక లావాదేవులపై పొదుపు మహిళలు అవగాహన కలిగి ఉండాలి కొత్తపల్లి కోఆర్డినేటర్ పుల్లయ్య
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఆర్థిక లావాదేవీలపై పొదుపు మహిళలు అవగాహన కలిగి ఉండాలని కొత్తపల్లి ఏరియా కోఆర్డినేటర్ పుల్లయ్య అన్నారు, ఆయన కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోని పొదుపు మహిళల ఆధ్వర్యంలో మన డబ్బు మన లెక్క గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు, ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పుల్లయ్య మాట్లాడుతూ మహిళా స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు మా డబ్బు లెక్కల యాప్ తో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు, దీని ద్వారా సభ్యులు ఎవరి చేతుల్లో మోసపోకుండా వారి ఆర్థిక వివరాలు వారే చూసుకునేలా ఉంటుందన్నారు, ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు వెంకటరమణా శివుడు రామకృష్ణ రత్