బెంగూళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సులో డ్రగ్స్ తీసుకు వస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ ఏ అండ్ సీ టీమ్‌ల సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ శివారులో బసుల్లో తనిఖీలు నిర్వహించగా 10 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 101 గ్రాముల గంజాయి, 5 కర్ణాటకకు చెందిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో హమీద్, అరిఫ్, హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.