కలతూరు దళిత రైతుల సమస్యలను పరిష్కరించాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ డిమాండ్
కేవీబి పురం మండలం కలతూరు దళిత రైతులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు మానాలని వైసీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త రాజేశ్ డిమాండ్ సోమవారం చేశారు. ప్రభుత్వ భూమిలో దళితులు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ అధికారులు ఆగడాలు మితిమీరడంతో వైసీపీ నేతలు స్పందించారు. దళితులపై ఫారెస్ట్ అధికారులు ఆగడాలను కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.