నాగిరెడ్డిపేట: గొడవ కేసులో నలుగురికి రూ.20,000 జరిమానా : ఎస్సై భార్గవ్
నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన దండు నర్సింలు, దండు శివరాములు, దండు అంజయ్య, దండు గణేష్‌లకు ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ గురువారం ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున, మొత్తం రూ.20,000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, 2019లో నీల సిద్ధిరాములు అనే వ్యక్తితో ఇంటి వివాదం కారణంగా ఈ నలుగురి మధ్య ఘర్షణ జరిగింది. ఘటనపై అప్పటి నాగిరెడ్డిపేట్ ఎస్సై మోహన్ నీల సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్ష్యాలు, వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులకు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్సై భార్గవ్ తెలిపారు.