ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కదలికలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు
Ongole Urban, Prakasam | May 23, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెడ్డి గ్యాంగ్ కదలికలతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శనివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. అనుమానిత వ్యక్తులను అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నించడంతోపాటు వారి వివరాలను సేకరించారు. ఎవరైనా అనుమానస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా వేసవి సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు బంగారం నగదు ఇళ్లల్లో ఉంచకుండా జాగ్రత్త పడ్డాలన్నారు.