హైద్రాబాద్ - బీజాపూర్ NH-163 అభివృద్ధి పనులపై గురువారం చేవెళ్లలో సమావేశం నిర్వహించారు. స్థానిక MLA కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఈజాతీయ రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కోసం చర్చిస్తున్నామన్నారు. పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ఉన్నారు.