నల్గొండ: అక్టోబర్ 25, 26 తేదీలలో హైదరాబాద్లో సీఐటీయూ మహాధర్నా: పాల్గొనాలని పిలుపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అక్టోబర్ 25, 26 తేదీలలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సీఐటీయూ మహాధర్నా నిర్వహించనుంది. లేబర్ కోడ్ల రద్దు, కనీస వేతనం పెంపు వంటి డిమాండ్లతో కార్మికులు నిరసన తెలపాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు.