బనగానపల్లె: బనగానపల్లె ఏపీ మోడల్ స్కూల్లో సీట్ల భర్తీకి ఆహ్వానం
నంద్యాల జిల్లా బనగానపల్లె రవ్వలకొండ ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ రామలక్ష్మి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 7, 8, 9 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశం ఉంది. అర్హులైన విద్యార్థులు జూన్ 20 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.