కొండపి: సింగరాయకొండలో సోమవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం
సింగరాయకొండలో సోమవారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తుంది . బలమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఆదివారం వరకు తీవ్రమైన ఎండతో ఇబ్బందిపడిన ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. కొన్నిచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు