నర్సాపురంలో దళితుల స్మశాన వాటికను అధికారులు కాపాడాలని వేడుకున్న దళితులు
నంద్యాల జిల్లా, రుద్రవరం మండలం,నరసాపురం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన సుమారు 200 కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పూర్వీకుల కాలం నుండి, తరతరాలుగా వారు ఉపయోగిస్తున్న శ్మశాన వాటిక ఇప్పుడు ఆక్రమణల పాలైంది. తమ ముత్తాతల కాలం నాటి ఈ శ్మశాన స్థలాన్ని, ఇటీవల ఒక వ్యక్తి తనదేనంటూ దౌర్జన్యానికి దిగారు. ఏకంగా డోజర్లతో శ్మశానాన్ని చదును చేసి, పాత సమాధులను సైతం ఆనవాలు లేకుండా ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, మృతదేహాలను పూడ్చడానికి వెళ్లిన ప్రతిసారీ కులం పేరుతో అసభ్యంగా దూషిస్తూ, దాడులకు దిగుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని బాధితుల