శ్రీశైలం నియోజకవర్గం లోని నాలుగు మండలాల్లో వేల ఎకరాల్లో వరి,మొక్కజొన్న పంట నష్టం, కన్నీరు పెట్టుకుంటున్న రైతులు,
శ్రీశైలం నియోజకవర్గం లోని నాలుగు మండలాల్లో, వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి, పంట నాశనం కావడంతో రైతులు కన్నీరు పర్వతం అవుతున్నారు, ఆత్మకూరు మండలంలో అత్యధికంగా మొక్కజొన్న సాగు చేస్తారు, ఈ మొక్కజొన్న వేల ఎకరాల్లో వర్షం దాటికి నాశమై భూమిలో కలిసిపోయింది, అలాగే బండి ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో 90 శాతం వరి సాగు చేస్తారు, ఈ వర్షం దాటికి వరి పడిపోయి కొన్ని ప్రాంతాల్లో వరి పై రెండు అడుగుల మేర నీళ్లు పారిపోవడంతో చేతి కాడికి వచ్చిన వరి పంట ఒక్క గింజ కూడా ఇంటికి వచ్చే పరిస్థితి లేదని రైతులు తెలియజేశారు, అలాగే మహానంది మండలంలో అరటి ,వరి పూర్తిగా దెబ్బతిందని రైతులు వాపోతున్నారు.